: పాక్ ప్రధాని తల్లికి మోదీ పాదాభివందనం!
ప్రధాని నవాజ్ షరీఫ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పేందుకు పాకిస్తాన్ వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది. లాహోర్ నగర శివారులోని రాయ్విండ్లోని నవాజ్ షరీఫ్ నివాసానికి వెళ్లిన మోదీకి.. పాక్ ప్రధాని కొడుకు, ఇతర కుటుంబ సభ్యులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తన కుటుంబసభ్యులను మోదీకి షరీఫ్ పరిచయం చేశారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన నవాజ్ షరీఫ్ తల్లికి ప్రధాని మోదీ పాదాభివందనం చేశారు.