: అంతరిక్షం నుంచి రాంగ్ కాల్... సారీ చెప్పిన వ్యోమగామి!
క్రిస్మస్ పండగ రోజు.. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్) నుంచి ఎర్త్ ప్లానెట్ కు ఒక రాంగ్ కాల్ వచ్చింది. ఆ రాంగ్ కాల్ చేసింది బ్రిటిష్ వ్యోమగామి టిమ్ పీక్. ‘హెలో, ఈజ్ దిస్ ప్లానెట్ ఎర్త్?’ అంటూ ఒక మహిళకు ఈ రాంగ్ కాల్ వెళ్లింది. ఆ తర్వాత అసలు విషయం తెలుసుకున్న టిమ్ అందుకు క్షమాపణలు చెప్పాడు. కావాలని ఈ ఫోన్ కాల్ చేయలేదని, పొరపాటున జరిగిందని అన్నాడు. క్రిస్మస్ సందర్భంగా తన ఇంటికి ఫోన్ చేస్తుండగా పొరపాటున రాంగ్ నంబర్ డయల్ అయిందని ట్వీట్ చేశాడు.