: పోలీసులను చూసి.. కొండపై నుంచి దూకిన పేకాటరాయుళ్లు..ఒకరి మృతి!


విజయవాడలోని గొల్లపాలెం గట్టులో విషాదం చోటుచేసుకుంది. పేకాట ఆడుకుంటున్న జూదగాళ్లు అక్కడికి పోలీసులు రావడం చూసి పరుగులు తీశారు. పోలీసులు తమను ఏం చేస్తారోననే భయంతో, కొండపై నుంచి కిందకు దూకేశారు. ఈ సంఘటనలో మధు అనే వ్యక్తి మృతి చెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన గురించి పోలీసులు మాట్లాడుతూ, ఒక కేసు విచారణ విషయమై తాము గొల్లపాలెం వెళ్లామని చెప్పారు. అక్కడ పేకాట ఆడుతున్న జూదరులు తమను చూసి వారి కోసం వచ్చామని భావించి పరుగులు తీశారని, కొండపై నుంచి దూకారని పోలీసులు చెప్పారు.

  • Loading...

More Telugu News