: మోదీ పాక్ పర్యటనను స్వాగతించిన కశ్మీర్ వేర్పాటువాదులు
ఆఫ్ఘనిస్తాన్ నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాకిస్థాన్ పర్యటనకు వెళ్లడాన్ని కశ్మీర్ వేర్పాటువాదులు స్వాగతించారు. మరోవైపు లాహోర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రత్యేక చాపర్ లో వెళ్లిన మోదీ పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ నివాసానికి చేరుకున్నారు. అక్కడ ఇరువురు నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా షరీఫ్ కు మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇదే సమయంలో షరీఫ్ కుటుంబ సభ్యులను మోదీ కలుసుకున్నారు. నేడు ఆయన మనవరాలు వివాహం, తన పుట్టిన రోజు నేపథ్యంలో మోదీకి పాక్ ప్రధాని ప్రత్యేక విందు ఇవ్వనున్నట్టు సమాచారం. ఈ ఆకస్మిక పర్యటనలో మోదీ, షరీఫ్ లు ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించే అవకాశముందని తెలుస్తోంది.