: తమిళనాడులో ఆలయాల ప్రవేశానికి భక్తులకు సంప్రదాయ దుస్తుల నిబంధన


తమిళనాడు భక్తులకు ఆ రాష్ట్ర దేవాదాయ శాఖ కొత్త నిబంధన విధించింది. రాష్ట్రంలోని దేవాలయాలకు వెళ్లే భక్తులందరూ ఇకపై సంప్రదాయ దుస్తుల్లోనే వెళ్లాలని స్పష్టం చేసింది. జీన్సు, లెగ్గింగ్స్, టీ షర్టులు తదితర మోడ్రన్ దుస్తులు ధరించడాన్ని నిషేధిస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు దేవాదాయ శాఖ ఉన్నతాధికారి ఒకరు దేవాలయాలకు ఓ సర్క్యులర్ జారీ చేశారు. అంటే ఇక నుంచి పురుషులు పంచె, పైజామా, పైన కండువా వేసుకుని గుడికి రావాలి. స్త్రీలు చీరలు, పరికిణీ ఓణీలు, చున్నీ సహా ఉన్న పంజాబీ డ్రస్సులే ధరించాలి. చిన్న పిల్లలు దేహమంతా కప్పుకొనేలా ఉన్న ఎలాంటి దుస్తులనైనా ధరించవచ్చు. ఈ నిబంధన జనవరి 1 నుంచి అమలులోకి రానుంది.

  • Loading...

More Telugu News