: జమ్ము కశ్మీర్ లో లష్కర్ ఉగ్రవాది హతం
జమ్ము కశ్మీర్ లో భద్రతా దళాలు జరిపిన ఎన్ కౌంటర్ లో లష్కరే తోయిబాకు చెందిన ఓ ముష్కరుడు హతమయ్యాడు. బందిపోరా జిల్లా పోలీసులు ఈ విషయాన్ని వెల్లడించారు. పుల్వామా జిల్లాకు చెందిన ఒమాయిస్ అహ్మద్ షేక్ అలియాస్ హమ్జాను సైనిక బలగాలు కాల్చి చంపాయని తెలిపారు. నిన్నటి నుంచి అక్కడ ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. ఉగ్రవాది మృతదేహాన్ని అతని కుటుంబ సభ్యులకు అప్పగించినట్టు పోలీసులు తెలిపారు. ఎన్ కౌంటర్ ఘటనతో పుల్వామా జిల్లాలో భద్రతను కట్టుదిట్టం చేశామని చెప్పారు. కొందరు యువకులు పోలీసులపై రాళ్లు రువ్వినప్పటికీ, ఎలాంటి అపాయం కలగలేదని తెలిపారు.