: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయ ప్రాంగణంలో టీటీడీ అధికారులు, అర్చకులు ఆయనకు స్వాగతం పలికారు. తరువాత ప్రణబ్ కు శాలువా కప్పి స్వామివారి దర్శనం చేయించారు. ఆయనతో పాటు గవర్నర్ నరసింహన్, ఏపీ సీఎం చంద్రబాబు కూడా దర్శనం చేసుకున్నారు. అనంతరం అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. తరువాత ప్రణబ్ కు అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు, వెంకటేశ్వరుడి జ్ఞాపికను అందజేశారు. టీటీడీ ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో సాంబశివరావు తదితరులు వీరి వెంట ఉన్నారు.