: వేద పాఠశాలను ప్రారంభించడం నా అదృష్టంగా భావిస్తున్నా: రాష్ట్రపతి


టీటీడీ వేద పాఠశాల భవన సముదాయాన్ని ప్రారంభించడం తన అదృష్టంగా భావిస్తున్నానని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఐ.భీమవరంలో భవన సముదాయం ప్రారంభం అనంతరం రాష్ట్రపతి మాట్లాడారు. వేద పాఠశాల సముదాయానికి టీటీడీ చేసిన కృషిని అభినందిస్తున్నానని చెప్పారు. వేదాలు దేశాల మధ్య స్నేహాన్ని, అనుబంధాన్ని పెంపొదిస్తాయని చెప్పారు. వేదాల ప్రచారం వల్ల ప్రపంచంలో శాంతి పరిఢవిల్లుతుందని అశిస్తున్నానని పేర్కొన్నారు. సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా ఈ వేద పాఠశాల నిలుస్తుందన్నారు. వందల, ఏళ్ల నుంచి ప్రపంచానికే వేద పాఠశాలలు అదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు.

  • Loading...

More Telugu News