: చిన్న పరిశ్రమకు రూ.232 కోట్ల కరెంట్ బిల్లు.. షాక్ తిన్న యజమాని


ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాదుకు చెందిన పరాగ్ మిట్టల్ ఓ చిన్న పరిశ్రమను స్థాపించుకుని జీవనం సాగిస్తున్నాడు. ఆ కంపెనీ స్థాయిని ఆధారం చేసుకుని 49 కిలో వాట్ల విద్యుత్ ను మాత్రమే వాడుకునే వెసులుబాటు ఉందంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వం మిట్టల్ కంపెనీకి షరతు కూడా విధించింది. అంతలోనే ఆయన విద్యుత్ ను వినియోగిస్తూ కార్యకలాపాలు సాగిస్తున్నాడు. ఇటీవల ఉత్తర ప్రదేశ్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారుల నుంచి గత నెల విద్యుత్ వాడకానికి సంబంధించి జారీ అయిన కరెంటు బిల్లును చూసి మిట్టల్ గుండె ఆగినంత పనైంది. మొత్తం 300,00,92,466 యూనిట్ల విద్యుత్ ను వాడారని ఆ బిల్లులో పేర్కొన్న యూపీపీసీఎల్ అధికారులు మొత్తం రూ.232,07,08,464 బిల్లు కట్టాలని అందులో పేర్కొన్నారు. తీరా బిల్లు పట్టుకుని తమ వద్దకు వచ్చిన మిట్టల్ కు యూపీపీసీఎల్ అధికారులు తాపీగా అసలు విషయం చెప్పారు. సాంకేతిక లోపం కారణంగానే ఈ తప్పు దొర్లిందని, వాస్తవ బిల్లును త్వరలోనే అందజేస్తామని ఆయనకు చెప్పి పంపారు.

  • Loading...

More Telugu News