: శ్రీకాకుళం జిల్లా టీడీపీ నాయకురాలికి తృటిలో తప్పిన పెను ప్రమాదం
శ్రీకాకుళం జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గౌతు శిరీషకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఈ ఉదయం కంచిలి మండలం బూర్ గామ్ వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు లారీని తప్పించబోయి అదుపు తప్పింది. ఈ క్రమంలో డివైడర్ ను ఢీ కొట్టింది. అయితే, ఆ సమయంలో శిరీష సీట్ బెల్డ్ పెట్టుకుని ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. అతి వేగమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.