: గట్టిగానే చిక్కాడు... నేడు కాకున్నా ఏదో ఒకరోజు జైట్లీ జైలుకే!: రాంజఠ్మలానీ


ప్రస్తుతం ఆర్థిక మంత్రి హోదాలో, ప్రభుత్వ సహకారంతో అరుణ్ జైట్లీ జైలు నుంచి తప్పించుకోవచ్చేమో గానీ, ఏదో ఒక రోజు ఆయన జైలుకు వెళ్లడం ఖాయమని ప్రముఖ న్యాయవాది, బీజేపీ నుంచి గతంలో గెంటివేయబడ్డ మాజీమంత్రి రాంజఠ్మలానీ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో వెలుగులోకి వచ్చిన క్రికెట్ అసోసియేషన్ అవకతవకల కేసులో జైట్లీ గట్టిగా ఇరుక్కుపోయాడని ఆయన అన్నారు. ఓ మరాఠీ చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన, జైట్లీ వంటి నిజాయతీ లేని వ్యక్తికి మద్దతు పలుకుతున్న మోదీపై తనకున్న గౌరవం పోయిందని, జైట్లీ కారణంగా మోదీ కూడా బాధపడే రోజులు రానున్నాయని అంచనా వేశారు. కాగా, తనకు పరువు నష్టం కలిగించారని ఆరోపిస్తూ, రూ. 10 కోట్లు చెల్లించాలని కేజ్రీపై అరుణ్ జైట్లీ దాఖలు చేసిన కేసులో కేజ్రీ తరఫున రాంజఠ్మలానీ వాదించనున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News