: నైజీరియాలో గ్యాస్ ట్యాంకర్ లో మంటలు... 100 మంది మృతి


నైజీరియాలో ఘోర ప్రమాదం జరిగింది. అక్కడి నేవీ ప్రాంతంలో ప్రమాదవశాత్తూ గ్యాస్ ట్యాంకర్ లో మంటలు చెలరేగి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇప్పటివరకు దాదాపు 100 మంది చనిపోయారని అధికారులు వెల్లడించారు. గ్యాస్ ట్యాంకర్ నుంచి ఖాళీ సిలిండర్లలోకి గ్యాస్ నింపుతుండగా మంటలు చెలరేగి ఒక్కసారిగా ట్యాంకర్ పేలడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు అదుపు చేశారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News