: ప్రపంచంలో ఎత్తయిన శాంతాక్లాజ్ భారత్ లోనే... పూరీ బీచ్ లో సుదర్శన్ పట్నాయక్ అద్భుతం
క్రిస్మస్ సందర్భంగా విశ్వవ్తాప్తంగా క్రైస్తవుల సందడి వాతావరణం నెలకొంది. అన్ని ప్రాంతాల్లోని చర్చిల్లో భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు జరుగుతున్నాయి. క్రిస్మస్ సందర్భంగా కనిపించే శాంతాక్లాజ్ విషయంలో హిందూ దేశంగా పేరుగాంచిన భారత్ లోనే రికార్డు నమోదైంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన శాంతాక్లాజ్ రూపం భారత్ లో దర్శనమిచ్చింది. సైకత శిల్పకళలో ఇప్పటికే పలు రికార్డులు నమోదు చేసిన భారత సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ పూరీ బీచ్ లో 45 అడుగుల భారీ శాంతాక్లాజ్ ను రూపొందించారు. తన శిష్య బృందంతో కలిసి ఆయన రూపొందించిన ఈ భారీ శాంతాక్లాజ్ అందరినీ ఆకట్టుకుంటోంది.