: ‘దావూద్’ పాకిస్తాన్ లో ఉండడు...వచ్చివెళుతూ ఉంటాడు... అంతే!: ‘డాన్’ సీఈఓ హమీద్


చీకటి వ్యాపారం రారాజు దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్ లో ఉండడని, తరచుగా ఇక్కడికి వచ్చి వెళుతుంటాడని పాకిస్థాన్ కు చెందిన 'డాన్' మీడియా గ్రూప్ సీఈఓ హమీద్ హరూన్ అన్నారు. ‘భారత్- పాకిస్తాన్ : ద్వైపాక్షిక చర్చల ద్వారా పురోగతి సాధించడమెలా?’ అనే అంశంపై ముంబయి ప్రెస్ క్లబ్, అబ్జర్వర్ రీసెర్చి ఫౌండేషన్ సంస్థ సంయుక్తంగా ఒక కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో హమీద్ హరూన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘నాకు తెలిసినంత వరకు, దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్ నివాసి కాదు. కాకపోతే, పాకిస్థాన్ కు తరచుగా వచ్చి వెళుతూ ఉంటాడు. దుబాయ్, దక్షిణాఫ్రికా దేశాల్లో దావూద్ ఎక్కువగా ఉంటాడు. దావూద్ హంతకుడు. దావూద్ అంత సంతోషంగా జీవిస్తున్నాడని నేను అనుకోవట్లేదు. అతన్ని నేనెన్నడూ చూడలేదు. హంతకులందరిపైన పాక్ ప్రభుత్వం చర్యలు చేపట్టాలి’ అంటూ ఆయన పేర్కొన్నారు. ద్వైపాక్షిక చర్చల కోసం ఈ రెండు దేశాలు తగినంత కృషి చేయని పక్షంలో దేశ ప్రజలు, ఎన్జీవో సంస్థలు చొరవ తీసుకోవాలని హమీద్ సూచించారు.

  • Loading...

More Telugu News