: తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద భక్తుల ఆందోళన!
తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద శ్రీవారి భక్తులు ఆందోళన చేపట్టారు. ప్రత్యేక దర్శనం, సహస్ర దీపాలంకరణ సేవల టికెట్లున్న భక్తులను దర్శనానికి అనుమతించకపోవడంతో వారు ఈ ఆందోళనకు దిగారు. టీటీడీ అధికారులపై వారు మండిపడుతున్నారు. కాగా, అధికారుల వాదన మరో విధంగా ఉంది. ప్రత్యేక దర్శనం, సహస్రదీపాలంకరణ సేవల టికెట్లు కొన్న భక్తులు వారికి కేటాయించిన సమయానికి రాలేదని, అందుకే వారిని అనుమతించలేదని వారు ఆరోపిస్తున్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కాన్వాయ్ ట్రయల్ రన్ వల్లే తమకు ఆలస్యమైందని భక్తులు అంటున్నారు.