: అదంతా అబద్ధం: మాజీ క్రికెటర్ అజారుద్దీన్


తాను మూడో పెళ్లి చేసుకుంటున్నానన్న వార్త అబద్ధమని మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కొట్టిపారేశారు. ఇదంతా అవాస్తవమని, చిన్నచిన్న పత్రికలు ఇలాంటి వార్తలే రాస్తుంటాయని.. వారికి మరో పని ఉండదని అన్నారు. హైదరాబాద్ నిజాం కళాశాలలో గురువారం జరిగిన మిలాద్-నబీ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన్ని పలుకరించిన విలేకరులతో మాట్లాడారు. ఇటీవల మూడో పెళ్లి చేసుకున్నాడన్న వార్త ప్రచారంపై ఆయన్ని ప్రశ్నించగా అజారుద్దీన్ స్పందిస్తూ, పెద్ద పత్రికలైనా ఇలాంటి వార్తలు రాసేముందు నిజానిజాలేంటో తెలుసుకుని రాయాల్సిందని, తనను సంప్రదిస్తే బాగుండేదని అన్నారు. వ్యక్తిగత అంశాలపై వార్తలు రాసేటప్పుడు స్పష్టత ఉండాలని అన్నారు. 'ఇవాళ నాకు జరిగింది రేపు మరొకరికి జరుగుతుంద'ని అన్నారు. మీడియా అంటే తనకు ఎంతో గౌరవమని, బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News