: ఐఎస్ఐఎస్ లో చేరకుంటే అంతే... ఇరాకీ అందాల సుందరికి బెదిరింపులు!


సుమారు 4 దశాబ్దాల తరువాత, ఇరాక్ లో అందాల పోటీలు జరుగగా, విజేతగా నిలిచిన షైమా ఖాసిమ్ కు ఇప్పుడు కొత్త చిక్కొచ్చి పడింది. ఆమెపై ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల కన్ను పడింది. తక్షణం వచ్చి తమతో చేరకుంటే కిడ్నాప్ చేస్తామని, ఆపై ఏం జరుగుతుందో ఊహించుకోవాలని ఆమెకు బెదిరింపు ఫోన్లు వస్తున్నాయి. ఈ విషయాన్ని షైమా స్వయంగా వెల్లడించింది. తాను ఇటువంటి బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేసింది. ఇరాక్ మహిళలకు అండగా నిలుస్తానని, తనపై ఉన్న బాధ్యతలు నెరవేర్చేందుకు కృషి చేస్తానని ధైర్యంగా చెబుతోంది.

  • Loading...

More Telugu News