: రాజ్యసభలో మన పెద్దలు వృథా చేసిన ప్రజాధనం రూ. 10 కోట్లు
పెద్దల సభగా పేరుగాంచిన రాజ్యసభలో కూడా సమావేశాలు సజావుగా సాగడం లేదు. లోక్ సభకు ఏ మాత్రం తీసిపోని రీతిలో రాజ్యసభ కూడా తయారైంది. నిరసనలు, నినాదాలు, పోడియంలోకి దూసుకెళ్లడం లాంటి ఘటనలు రాజ్యసభలో కూడా సర్వసాధారణమైన అంశాలుగా మారిపోయాయి. ఈ సారి రాజ్యసభ సమావేశాలు 50 శాతం కూడా సరిగా కొనసాగలేదు. వాయిదాలు, అంతరాయాల కారణంగా 55 గంటలు వృథా అయినట్టు పీఆర్సీ లెజిస్లేటివ్ రీసర్చ్ వెల్లడించింది. సభ నిర్వహణకు ఒక్కో నిమిషానికి రూ. 29 వేలు ఖర్చవుతుంది. అంటే, గంటకు రూ. 17.40 లక్షలు ఖర్చవుతాయి. ఈ లెక్కన మొత్తం 55 గంటలకు గాను రూ. 9.57 కోట్ల ప్రజాధనం వృథా అయిందన్నమాట.