: గూగుల్ శోధనలో ఈ ఏడాది 10 టాప్ ట్రెండింగ్ ఫోన్లు


గూగుల్ శోధనలో ఈ ఏడాది పది ఫోన్లు టాప్ ట్రెండింగ్ గా నిలిచాయి. అందులో మైక్రో మాక్స్ కు చెందిన 'యు యురేకా స్మార్ట్ ఫోన్' గూగుల్ విడుదల చేసిన టాప్ ట్రెండింగ్ లిస్టులో మొదటిస్థానంలో నిలిచింది. ఎంతో ఫేమస్ అయిన యాపిల్ స్మార్ట్ ఫోన్ ను వెనక్కి నెట్టిమరీ మైక్రో మాక్స్ యురేకానే అగ్రస్థానంలో నిలవడం విశేషం. 2014 డిసెంబర్ చివర్లో భారత మార్కెట్లో విడుదలైన ఈ ఫోన్ ధర రూ.8,999. 5.5 ఇంచెస్ డిస్ ప్లే, ఫ్రంట్, బ్యాక్ కెమెరా ఫీచర్లు ఉన్నాయి. తరువాత స్థానాల్లో యాపిల్ ఫోన్ 6ఎస్, లెనోవో కే3 నోట్, లెనోవో ఏ 7000, మోటో జీ, మైక్రోమ్యాక్స్ కాన్వాస్ సిల్వర్ 5, సామ్ సంగ్ గెలాక్సీ జే7, మోటో ఎక్స్ ప్లే, మైక్రోమాక్స్ కాన్వాస్ స్పార్క్, లెనోవో ఏ 6000 తొలి పది స్థానాల్లో నిలిచాయి.

  • Loading...

More Telugu News