: సల్మాన్ సరసన టీవీ సీరియల్ నటి!
ప్రేమ్ రతన్ ధన్ పాయో హీరో సల్మాన్ ఖాన్ తాజా చిత్రం 'సుల్తాన్'. ఈ చిత్రంలో సల్మాన్ సరసన నటిస్తారని పలువురు ప్రముఖ హీరోయిన్ల పేర్లు ఇంతవరకూ వినపడ్డాయి. ఆ వరుసలో పరిణితీ చోప్రా, కంగనారనౌత్, దీపికాపదుకొనే వంటి ప్రముఖ హీరోయిన్ల పేర్లు వినిపించాయి. అయితే, వీళ్లందరికీ చెక్ పెడుతూ.. ఒక టీవీ సీరియల్ లో నటిస్తున్న ఒక అమ్మాయిని ఈ సినిమాలో హీరోయిన్ గా సెలక్టు చేశారు. జీటీవీలో ప్రసారం అవుతున్న 'కుంకుం భాగ్య' సీరియల్ లో బుల్ బుల్ పాత్రలో నటిస్తున్న మృణాల్ థాకూర్‌ను సుల్తాన్ సినిమాలో హీరోయిన్గా ఫైనల్ చేశారట. సల్మాన్ సినిమాకు హీరోయిన్ గా ఎంపికవడంతో ఆ సీరియల్ లో నటించడానికి మృణాల్ స్వస్తి చెప్పిందని తెలుస్తోంది.