: సముద్రంలో చిక్కుకుపోయిన మత్స్యకారులు... కుటుంబసభ్యుల్లో ఆందోళన
చేపల వేటకు వెళ్లిన ఐదుగురు మత్స్యకారులు సముద్రంలో చిక్కుకు పోయారు. వీరంతా తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పర్లోవపేటకు చెందిన వారు. ఈ నెల 10వ తేదీన ఫైబర్ బోటులో వీరు చేపల వేటకు వెళ్లారు. అయితే, బోటు ఇంజిన్ చెడిపోవడంతో సముద్రంలో నిలిచిపోయింది. వీరు సముద్రంలో చిక్కుకుపోయినట్టు కోస్ట్ గార్డ్ సిబ్బందికి మత్స్యశాఖ అధికారులు సమాచారం అందించారు. సముద్రంలో ప్రతికూల పరిస్థితులు లేనందువల్ల వారంతా క్షేమంగానే ఒడ్డుకు చేరుకుంటారని ఇతర మత్స్యకారులు అంటున్నారు. మరోవైపు, వారి కుటుంబసభ్యులు మాత్రం తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు.