: చండీయాగంలో రుత్విక్కుల ఆహార వివరాలు


మెదక్ జిల్లాలోని కేసీఆర్ ఫామ్ హౌస్ లో అయుత మహా చండీయాగం నిర్విఘ్నంగా కొనసాగుతోంది. పరమ నిష్టాగరిష్టులైన 1500 మంది వేద పండితులు ఈ యాగంలో పాల్గొంటున్నారు. రుత్విక్కులు రోజుకు ఒక పూట భోజనం, రెండు పూటల అల్పాహారం స్వీకరిస్తారు. యాగశాలలో ఉన్నంత సేపు మంచి నీళ్లు కూడా ముట్టరు. ఈ నేపథ్యంలో, రుత్విక్కుల నేటి భోజన వివరాలు ఇలా ఉన్నాయి. * ఉదయం అల్పాహారంలో... అటుకుల పొంగలి, చట్నీ. * మధ్యాహ్న భోజనంలో... అన్నం, చపాతీ, ఆకుకూర పప్పు, క్యాప్సికం కూర, రసం, సాంబారు, పులిహోర, ఆలు బోండా, బాదుషా, రోటి పచ్చడి. * రాత్రి అల్పాహారంలో... పూరి, పన్నీర్ బటర్ మసాల, ఆలు కుర్మా.

  • Loading...

More Telugu News