: ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో రామప్ప దేవాలయం
తెలంగాణలోని వరంగల్ జిల్లా వెంకటాపురం మండలం పాలంపేటలోని రామప్ప దేవాలయానికి కేంద్ర ప్రభుత్వ గుర్తింపు లభించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనల మేరకు యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా ఆ ఆలయాన్ని గుర్తించి జాబితాలో చేర్చింది. దాంతో పాటు రామప్ప సమీపంలో ఉన్న ములుగు రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఇతర పర్యాటక ప్రాంతాలను కలుపుతూ పర్యాటక గ్రామం ఏర్పాటు చేయాలని అధికారులు ప్రణాళిక వేస్తున్నారు. ఇందుకోసం ములుగు మండలం ఇంచెర్ల గ్రామ శివారులోని రెండు ప్రభుత్వ స్థలాలను పరిశీలించారు. వాటిలో ఒకదాన్ని ఎంపిక చేస్తామన్నారు. రామప్ప ఆలయాన్ని ఆధారం చేసుకొని సుమారు 10 నుంచి 15 ఎకరాల స్థలంలో రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో పర్యాటక గ్రామాన్ని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, భారత సాంస్కృతిక మంత్రిత్వ శాఖ రూ.90 కోట్లు ఇచ్చే అవకాశం ఉంది.