: గుండు సుధారాణిపై అనర్హత వేటు వేయండి: సుజనా చౌదరి


టీడీపీ రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి ఇటీవలే టీఆర్ఎస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఆమెపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేస్తూ టీడీపీ నేత, కేంద్ర మంత్రి సుజనా చౌదరి రాజ్యసభ ఛైర్మన్ కు లేఖ రాశారు. సుధారాణి అధికారికంగా టీఆర్ఎస్ లో చేరినందున ఆమెపై వేటు వేయాలని లేఖలో కోరారు. వచ్చే ఏడాది జూన్ వరకు సుధారాణికి పదవీ కాలం ఉంది. ఈ లోగానే ఆమెపై వేటు వేయాలని సుజనా చౌదరి కోరారు.

  • Loading...

More Telugu News