: లొంగిపోని శింబు... పోలీసుల వేట మొదలు!
తమిళనాట 'బీప్' సాంగ్ వివాదంపై, పోలీసులు పలుమార్లు పంపిన నోటీసులకు సమాధానమివ్వని నటుడు శిలంబరసన్ అలియాస్ శింబును ఎలాగైనా అరెస్ట్ చేయాలన్న ఉద్దేశంతో చెన్నై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వేట మొదలు పెట్టారు. లొంగిపోకుండా తప్పించుకుని తిరుగుతూ, మీడియాకు ప్రకటనలు విడుదల చేయడం, ముందస్తు బెయిలును కోర్టు నిరాకరించినా, పోలీసుల ముందుకు రాకపోవడాన్ని ఉన్నతాధికారులు సీరియస్ గా తీసుకున్నారని తెలుస్తోంది. మరోవైపు కోవై రేస్ కోర్స్ పోలీసులు శింబు, అనిరుధ్ లపై ఐపీసీలోని 4 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, లొంగుబాటుకు తుది అవకాశంగా, జనవరి 2న స్టేషనుకు హాజరు కావాలని నోటీసులు పంపారు. చెన్నై పోలీసులు మాత్రం శింబు ఆచూకీ కోసం గాలిస్తున్నామని, అరెస్ట్ తప్పదని చెబుతున్నారు.