: అయోధ్యలో రామ మందిరం ప్రతి భారతీయుడి కోరిక: వెంకయ్యనాయుడు వ్యాఖ్య
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు నిన్న కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగిసిన సందర్భంగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి హోదాలో మీడియాతో మాట్లాడిన ఆయన రామ మందిర నిర్మాణాన్ని ప్రస్తావించారు. అయోధ్యలో రామ మందిరం నిర్మాణాన్ని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నాడని వెంకయ్య వ్యాఖ్యానించారు. అప్పటికి కాస్త ముందుగా, వీహెచ్ పీ వ్యాఖ్యలు, రామ మందిరం నిర్మాణం కోసం ఇటుకలు తరలిస్తున్న వైనంపై రాజ్యసభలో విపక్షాలు ఒంటికాలిపై లేచాయి. సభ కార్యకలాపాలను అడ్డుకున్నాయి. దీంతో సభ కొద్దిసేపు వాయిదా కూడా పడింది. ఈ క్రమంలో సమావేశాలు నిరవధికంగా వాయిదా పడిన వెంటనే రామ మందిరం నిర్మాణంపై వెంకయ్య కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం.