: ‘గరం’ ఆడియో వేడుకలో 'ఆది' దర్శకులకు సన్మానం


యంగ్ హీరో ఆది, అదా శర్మ జంటగా నటిస్తున్న 'గరం' చిత్రం ఆడియో రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ‘పెళ్ళైన కొత్తలో’, ‘గుండె ఝల్లుమంది’, ‘ప్రవరాఖ్యుడు’ సినిమాల డైరెక్టర్ మదన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆడియో రిలీజ్ కార్యక్రమానికి యువనటులు రానా, రాజ్ తరుణ్ తదితరులు హాజరయ్యారు. ఈ చిత్రం టైటిల్ సాంగ్ ను రాజ్ తరుణ్ విడుదల చేశారు. ఈ చిత్రం ఆడియో రిలీజ్ కార్యక్రమానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఇదేరోజున హీరో ఆది పుట్టినరోజు కూడా అవడంతో అభిమానులు, చిత్రయూనిట్ ఉల్లాసంగా ఉన్నారు. ఈ సందర్భంగా ఇప్పటి వరకు ఆది నటించిన చిత్రాల దర్శకులకు ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్టు, ఆది తండ్రి హీరో సాయికుమార్ సన్మానం చేశారు.

  • Loading...

More Telugu News