: హైదరాబాద్ లో నకిలీ పిండి... నిందితుల అరెస్టు!


హైదరాబాద్ లో ‘నకిలీ’ల తాకిడి ఎక్కువైపోతూ ఉంది. నకిలీ మసాలాలు, పచ్చళ్లు, నూనెలు, నెయ్యి, నూడుల్స్ వంటి పలు రకాల నిత్యావసర వస్తువులను హైదరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో తయారు చేస్తున్న విషయం ఇటీవల వెలుగులోకి రావడం, నిందితులను అరెస్టు చేయడం తెలిసిందే. తాజాగా, రాజేంద్రనగర్ పరిధిలో ఉండే టాటానగర్ లో ఒక పిండి మిల్లులో ఈ నకిలీ పిండి వ్యవహారం బయటపడింది. ఈ మేరకు ఎస్ వోటీ పోలీసులకు సమాచారం అందడంతో ఈ మిల్లుపై బుధవారం నాడు వారు దాడి చేశారు. మిల్లును సీజ్ చేసి, ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

  • Loading...

More Telugu News