: సభ జరుగుతున్నప్పుడు నోటీసు ఇవ్వకుండా... అయిపోయిన తర్వాత ఇస్తారా?: వైకాపాపై కాల్వ ఫైర్
సరైన వ్యూహం లేకుండా వైకాపా వ్యవహరిస్తోందని ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు ఎద్దేవా చేశారు. స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై వైకాపా అవిశ్వాస తీర్మానం నోటీసును ఇవ్వడాన్ని ఆయన తప్పుబట్టారు. కేవలం ప్రచారంలో భాగంగానే నోటీసు ఇచ్చారని ఆరోపించారు. అయినా, శాసనసభ సమావేశాలు జరిగే సమయంలో నోటీసు ఇవ్వకుండా, అయిపోయిన తర్వాత ఇవ్వడమేంటని ప్రశ్నించారు. సీనియర్ నేత అయిన కోడెలను లక్ష్యంగా చేసుకుని అవిశ్వాసం ఇవ్వడం సరికాదని అన్నారు. సమావేశాల సమయంలో ప్రజలకు ఉపయోగపడే అంశాలను జగన్ మాట్లాడలేదని, అనవసరంగా సమయాన్ని వేస్ట్ చేశారని మండిపడ్డారు.