: ఆ దందా నుంచి లోకేష్ కు రోజుకు రూ. కోటి వస్తోంది: జగన్


ఇసుక ధరను రూ. 40 నుంచి రూ. 700కు పెంచారని... ఆ లెక్క ప్రకారం రూ. 1500 కోట్ల వరకు ఆదాయం రావాల్సి ఉండగా, రూ. 800 కోట్ల రూపాయలనే లెక్కలో చూపుతున్నారని ప్రభుత్వంపై వైకాపా అధినేత జగన్ మండిపడ్డారు. ఉభయ గోదావరి జిల్లాల్లో ఇసుక దందా ఎక్కువగా ఉందని... అక్కడి నుంచి నారా లోకేష్ కు ప్రతి రోజూ రూ. కోటి అందుతోందని ఆరోపించారు. ప్రతి ప్రాజెక్టులో అవినీతి రాజ్యమేలుతోందని అన్నారు. ప్రైవేట్ వ్యక్తులకు ప్రభుత్వం కేటాయిస్తున్న భూముల విషయం దారుణంగా ఉందని... బాలకృష్ణ బంధువులకు కేవలం లక్ష రూపాయలకే భూమిని కేటాయించారని మండిపడ్డారు. 99 ఏళ్లకు లీజుకు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News