: అవినీతిపై పోరాడుతున్న కీర్తి ఆజాద్ ‘హీరో’: ఎంపీ శత్రుఘ్నసిన్హా


అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న బీజేపీ ఎంపీ కీర్తి ఆజాద్ హీరో అని ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటుడు, అదే పార్టీకి చెందిన నేత శత్రుఘ్నసిన్హా స్వయంగా కితాబిచ్చారు. ఈ మేరకు ఆయన ఒక ట్వీట్ చేశారు. కీర్తి ఆజాద్ పై ఎటువంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోవద్దని తాను వినయపూర్వకంగా తన మిత్రులను కోరుతున్నాను అని ఆ ట్వీట్ లో కోరారు. కాగా, ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) నిధుల దుర్వినియోగానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ పాల్పడ్డారని సీఎం కేజ్రీవాల్ ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ, ఆప్ ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. అయితే, బీజేపీ పార్టీకే చెందిన ఎంపీ కీర్తి ఆజాద్ కూడా జైట్లీ వ్యవహారంపై అసంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా పలు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయనపై సస్సెన్షన్ వేటు వేసేందుకే బీజేపీ అధిష్ఠానం సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News