: ఇంటర్వ్యూ కోసం జైలు కెళ్తే...ఖైదీలు ఉతికేశారు


పంజాబ్ లో ఓ సీనియర్ జర్నలిస్టు జైలు ఖైదీల చేతిలో దాడికి గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే...పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న బల్వంత్ సింగ్ రజోనాను ఇంటర్వ్యూ చేసేందుకు ప్రముఖ పాత్రికేయుడు కన్వార్ సంధు జైలు అధికారుల నుంచి అనుమతి పొందారు. దీంతో బల్వంత్ సింగ్ రజోనాను ఇంటర్వ్యూ చేసేందుకు పాటియాలా జైలుకు వెళ్లారు. ఆ సమయంలో కన్వార్ సంధుపై కొంత మంది ఖైదీలు దాడికి దిగారు. దీంతో సకాలంలో స్పందించిన పోలీసులు, వారిని అడ్డుకున్నారు. దీనిపై పంజాబ్ లో పెను దుమారం రేగుతోంది. జైలులో ఇంటర్వ్యూకి అనుమతి ఇవ్వడమేంటని ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రభుత్వం ఓ అధికారిని సస్పెండ్ చేసింది.

  • Loading...

More Telugu News