: దావూద్ కారుకు నిప్పుపెట్టిన స్వామి చక్రపాణి


అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం కారుకు అఖిల భారత హిందూ మహాసభ అధ్యక్షుడు స్వామి చక్రపాణి బహిరంగంగా నిప్పుబెట్టారు. ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఢిల్లీకి సమీపంలోని ఘజియాబాద్ లో ఈ కారును ఆయన తగులబెట్టారు. కారు ముందు భాగంలో దావూద్ ఫొటోలను ఉంచి, కారు లోపల, బయట కట్టెలు పేర్చారు. అనంతరం స్వామి చక్రపాణి దానికి నిప్పటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కారు దగ్ధంతో టెర్రరిజానికి అంత్యక్రియలు జరిపామని అన్నారు. కాగా, దావూద్ వాడిన ఎంహెచ్04-ఏఎక్స్3676 అనే నంబరు గల హ్యుందాయ్ యాక్సెంట్ గ్రీన్ కలర్ కారును ఇటీవల జరిగిన వేలం పాటలో స్వామి చక్రపాణి దక్కించుకున్నారు.

  • Loading...

More Telugu News