: కోడి 50 వేలు...'కాల్ మనీ' శ్రీకాంత్ పందెం కోళ్ల వ్యవహారం!


విజయవాడలో వెలుగు చూసిన కాల్ మనీ ప్రధాన నిందితుడు పెండ్యాల శ్రీకాంత్ కు చెందిన పందెం కోళ్ల ఫాంను పోలీసులు సీజ్ చేశారు. విజయవాడ శివారు అప్పారావు పేటలో శ్రీకాంత్ కు చెందిన పదెకరాల మామిడి తోటలో పందెం కోళ్ల ఫాంను పోలీసులు గుర్తించారు. అక్కడికి వెళ్లి చూడగా, భారీ ఎత్తున సంక్రాంతి పందేలకు ఉపయోగించే వివిధ జాతులకు చెందిన పందెం కోళ్లను చూసిన పోలీసులు అవాక్కయ్యారు. ఇక్కడ పెంచిన ఒక్కో కోడి ధర 50 వేల రూపాయలని తెలుసుకుని నోళ్లు వెళ్లబెట్టారు. పరారీలో ఉన్న శ్రీకాంత్ ఈ కోళ్ల ఫాం రక్షణకు చేసిన పకడ్బందీ ఏర్పాట్లను చూసిన పోలీసులు, దీనిని అధీనంలోకి తీసుకున్నారు. దీనిని సీజ్ చేసి, నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News