: ఎమర్జెన్సీ తొలి ముద్దాయి జనరల్ కయానీ!... బాంబు పేల్చిన పాక్ మాజీ అధ్యక్షుడు ముషార్రఫ్
పాకిస్థాన్ లో 2007లో విధించిన ఎమర్జెన్సీకి సంబంధించిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ దేశ మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషార్రఫ్ బాంబు లాంటి వార్త పేల్చారు. నాటి ఎమర్జెన్సీపై తీసుకున్న నిర్ణయం తన ఒక్కడిదే కాదని పేర్కొన్న ఆయన, ఆ నిర్ణయంలో నాటి పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అష్పక్ పర్వేజ్ కయానీదే కీలక భూమిక అని పేర్కొన్నారు. ఇటీవల ఆయన ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ ‘డాన్’ పత్రికకు చెందిన ఆన్ లైన్ ఎడిషన్ లో తాజాగా ప్రత్యక్షమైంది. ఎమర్జెన్సీపై నిర్ణయం తీసుకునే ముందు తాను కయానీతో పాటు పౌర, మిలిటరీ ఉన్నతాధికారులను సంప్రదించానని ముషార్రఫ్ సదరు ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అసలు ఎమర్జెన్సీ నిర్ణయంలో తొలి ముద్దాయి జనరల్ కయానీనేనని ఆయన వాదించారు.