: ఆ పాట విషయంలో తన తప్పు లేదంటున్న శింబు
ప్రముఖ కోలీవుడ్ నటుడు శిలంబరసన్ (శింబు) బీప్ సాంగ్ విషయంలో తన తప్పు లేదని న్యాయస్థానానికి విన్నవించుకున్నాడు. ముందస్తు బెయిల్ కోసం అర్జీ పెట్టుకున్న శింబు పిటిషన్ ను న్యాయస్థానం విచారించింది. తాను నటుడినే కాకుండా సింగర్ ను కూడా అని శింబు న్యాయస్థానానికి తెలిపాడు. పలు సినిమా పాటలతో పాటు, ప్రైవేటు ఆల్బమ్స్ లో కూడా పాడుతుంటానని చెప్పాడు. అలా పాడిన డమ్మీ పాటే బీప్ సాంగ్ అని న్యాయస్థానానికి వెల్లడించాడు. ఆ పాటను తాను ఏ సోషల్ నెట్ వర్క్ లోనూ ప్రచారం చేయలేదని, దానిని దొంగతనంగా ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశానని పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిపై శింబు తరపు న్యాయవాది ముత్తు రామస్వామి, ప్రాసిక్యూషన్ తరపు న్యాయవాది మహ్మద్ రియాజుద్దీన్ వాదోపవాదాలు వినిపించారు. దీంతో ఈ పాటను ఇంటర్నెట్ , సామాజిక మాధ్యమాల నుంచి తొలగించాలని న్యాయమూర్తి ఆదేశించారు. అలాగే శింబుకు ముందస్తు బెయిల్ నిరాకరించారు.