: ఢిల్లీ న్యాయస్థాన ప్రాంగణంలో కాల్పుల కలకలం


దేశ రాజధాని ఢిల్లీలో పగలు, రాత్రి అన్న తేడా లేకుండా తుపాకులు గర్జిస్తున్నాయి. గత నెలలో ఓ వ్యాపారిని దుండగులు పెట్రోల్ బంకు దగ్గర కాల్చి చంపగా, మరోసారి ఢిల్లీ నడిబొడ్డున న్యాయస్ధాన ప్రాంగణం సాక్షిగా తుపాకులు గర్జించాయి. కర్కర్ డూమా న్యాయస్థాన ప్రాంగణంలో గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పులను ప్రతిఘటించిన ముగ్గురు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. సుమారు పది రౌండ్ల కాల్పుల అనంతరం ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సిఉంది.

  • Loading...

More Telugu News