: 200 ఏళ్ల తర్వాత ఇదే తొలి చండీయాగం


గత 200 ఏళ్లలో ఎవరూ చండీయాగాన్ని నిర్వహించిన దాఖలాలు లేవని శృంగేరి పీఠం ముఖ్య కార్యనిర్వహణ అధికారి గౌరీ శంకర్ తెలిపారు. శృంగేరి పీఠం నుంచి ప్రత్యేక దూతగా ఆయన ఎర్రవెల్లిలో జరుగుతున్న అయుత చండీయాగానికి విచ్చేశారు. ఈ సందర్భంగా, చండీయాగం నిర్వహిస్తున్న కేసీఆర్ కు శృంగేరి పీఠాధిపతి భారతీతీర్థ స్వామి ఆశీస్సులు అందజేసిన సందేశాన్ని యాగస్థలిలో ఆయన చదివి వినిపించారు. ప్రజల సంక్షేమం కోసం కేసీఆర్ చేస్తున్న యాగం చరిత్రలో నిలిచిపోతుందని ఆయన అన్నారు. ధర్మరాజు 'రాజసూయ' యాగం నిర్వహించిన తరహాలో ఈ యాగానికి ఏర్పాట్లు చేశారని కితాబిచ్చారు. రుత్విజులతో యాగశాల మినీ ఇండియాను తలపిస్తోందని చెప్పారు.

  • Loading...

More Telugu News