: ఆ డబ్బు ఎక్కడిదో వెల్లడించాలి: కేసీఆర్ కు డిగ్గీరాజా డిమాండ్


తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేపట్టిన అయుత చండీయాగంపై తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జీ దిగ్విజయ్ సింగ్ ట్విట్టర్ మాధ్యమంగా విమర్శలు చేశారు. తెలంగాణలో వందలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న వేళ కోట్ల రూపాయలు వెచ్చించి యాగాలు చేయడం సమంజసమా? అని ప్రశ్నించారు. అయుత చండీయాగానికి తన సొంత సొమ్ము వాడుతున్నానని కేసీఆర్ ప్రకటించారని, అయితే ఆ డబ్బు ఎంత? అనే విషయం స్పష్టం చేయాలని ఆయన సూచించారు. అన్ని కోట్ల రూపాయలు తనకు ఎలా సమకూరాయన్న విషయాన్ని కేసీఆర్ ప్రజలకు వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజాధనం దుర్వినియోగం చేయడం సమంజసం కాదని ఆయన హితవు పలికారు.

  • Loading...

More Telugu News