: మద్యం తాగితే యువతకు గుండెజబ్బులు, పక్షవాతం


మితిమీరి లిక్కర్‌ సేవించడం వలన... గుండెజబ్బులు, పక్షవాతం సోకే ప్రమాదం యుక్తవయస్సులోనే పొడసూపుతుందని... వృద్ధులతో సమానంగా యువకుల్లోనూ ఈ బెడద ఉంటుందని శాస్త్రవేత్తలు తమ తాజా అధ్యయనం ద్వారా అభిప్రాయపడుతున్నారు. ఇలియానియస్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలో ఈ విషయం నిరూపణ అయింది. యుక్తవయసులోనే అతిగా మద్యం తాగే అలవాటు ఉంటే.. అధిక రక్తపోటు, కొవ్వుశాతం పెరగడం వంటివి కూడా ఎక్కువగా ఉండి.. గుండెజబ్బులకు, పక్షవాతానికి దారి తీస్తుందిట.

అబ్బాయిలు రెండు గంటల్లో అయిదు, అంతకంటె ఎక్కువ గ్లాసుల మద్యం తాగే అలవాటు ఉంటే.. నెలలో ఆరుసార్లు ఇలాంటి పార్టీలు చేసుకునే అలవాటు ఉంటే.. అతిగా మద్యం తాగడం కింద లెక్కకట్టారు. ఇలా నాలుగేళ్లపాటూ తాగితే చాలు.. నలభై-అరవై ఏళ్లపాటూ మద్యం తాగుతున్న వారితో సమానంగా వారికి జబ్బులు సోకే అవకాశం ఏర్పడుతుందిట. అతిగా మద్యం తాగే యువతరంలో రక్తప్రసరణను నియంత్రించే రెండు కీలక కణాలు పూర్తిగా దెబ్బతినడం వలన.. ఇలా జరుగుతుందిట. ఇది క్రమంగా ధమనుల్ని క్షీణింపజేస్తుందని.. అందువల్లనే హృద్రోగాలు వస్తాయని వారి పరిశోధనలో తేలింది.

  • Loading...

More Telugu News