: రాహుల్ ను ‘బుద్ధు’గా అభివర్ణించిన స్వామి... భవిష్యత్తు లేదని వ్యాఖ్య
కాంగ్రెస్ పార్టీపై బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి మరోమారు విరుచుకుపడ్డారు. జాతీయ చానెల్ ‘ఆజ్ తక్’కు నేటి ఉదయం ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన రాహుల్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నేతల వైఖరిపైనా నిప్పులు చెరిగారు. ఇటీవల పలు అంశాలపై రాహుల్ గాంధీ చేస్తున్న వ్యాఖ్యలు, పర్యటనలపై స్పందించమని కోరగా, స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీని ‘బుద్ధు’గా అభివర్ణించిన స్వామి, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడికి అసలు భవిష్యత్తే లేదని కూడా వ్యాఖ్యానించారు. ఇక నేషనల్ హెరాల్డ్ వ్యవహారంపై తాను దాఖలు చేసిన పిటిషన్ కు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ సహా రాహుల్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్వామి... అబద్ధాలు చెప్పడం కాంగ్రెస్ నేతలకు అలవాటైపోయిందని దుమ్మెత్తిపోశారు.