: సొంత ఇలాకాకు రాహుల్ గాంధీ... రెండు రోజుల పాటు అమేథీలో పర్యటన


నేషనల్ హెరాల్డ్ కేసులో బెయిల్ పొందిన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు తొలిసారిగా తన సొంత నియోజకవర్గం అమేథీ పర్యటనకు నేడు బయలుదేరుతున్నారు. నేడు, రేపు ఆయన అమేథీలోనే పర్యటిస్తారు. ఈ సందర్భంగా పార్టీ నేతలతో సమీక్షలతో పాటు ఆయన తన సొంత నియోజకవర్గ ప్రజలతోనూ మమేకం కానున్నారు. ఇటీవల తమిళనాడు, పుదుచ్చేరీల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు వెళ్లిన రాహుల్ గాంధీ, నేషనల్ హెరాల్డ్ కేసు నేపథ్యంలో కుదురుగా ఉండలేకపోయారు. తాజాగా ఈ కేసులో బెయిల్ లభించిన ఆయన తన సొంత నియోజకవర్గంలో మాత్రం కాస్తంత ప్రశాంతంగానే పర్యటించనున్నారు.

  • Loading...

More Telugu News