: యాగక్షేత్రంలో కేసీఆర్ కు పూర్ణకుంభంతో స్వాగతం... కుటుంబంతో కలిసి ప్రదక్షిణలు చేసిన టీఎస్ సీఎం


టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిర్వహించతలపెట్టిన అయుత చండీయాగం మరికాసేపట్లో ప్రారంభం కానుంది. మెదక్ జిల్లా జగదేవపూర్ మండలం ఎర్రవల్లిలోని కేసీఆర్ సొంత వ్యవసాయ క్షేత్రం (ఫామ్ హౌస్)లో జరగనున్న ఈ యాగం కోసం కేసీఆర్ కొద్దిసేపటి క్రితం యాగక్షేత్రానికి చేరుకున్నారు. తన కుటుంబసభ్యులతో కలిసి వచ్చిన కేసీఆర్ కు రుత్విక్కులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం కేసీఆర్ సకుటుంబ సమేతంగా యాగక్షేత్రం చుట్టూ ప్రదక్షిణలు చేశారు.

  • Loading...

More Telugu News