: కేంద్రాన్ని 25,912 కోట్ల సహాయం కోరిన జయలలిత
వరదల వల్ల నష్టపోయిన తమిళనాడును ఆదుకునేందుకు 25,912 కోట్ల రూపాయల సాయం కావాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత కేంద్రాన్ని కోరారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, ముంచెత్తిన వరదల వల్ల రాష్ట్రం అతలాకుతలమైందని, ప్రధాన పట్టణాల్లో మౌలికవసతులు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఇల్లు, ఇతర సదుపాయాల కోసం 25,912 కోట్ల రూపాయల ఆర్థిక సాయం చేయాలని ఆమె కేంద్రానికి సూచించారు. ఈ వరదల ధాటికి రాష్ట్రప్రభుత్వం కుదేలైపోయిందని, ఇంత నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి భరించే స్తోమత లేదని, అందుకే కేంద్రం సాయం కోరుతున్నామని ఆమె స్పష్టం చేశారు. రాష్ట్ర పునర్నిర్మాణ పనులు చాలా వ్యయంతో కూడుకున్నవని, అందుకే సాయం చేయాలని ఆమె కేంద్రానికి తెలిపారు.