: నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాల్లో ముగిశాయి. ఐటీ, ఎఫ్ఎంసీజీ, మెటల్ స్టాక్స్ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోవడంతో ట్రేడింగ్ చివర్లో మార్కెట్లు ఒక్కసారిగా నష్టాల్లోకి జారుకున్నాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి... బీఎస్ఈ సెన్సెక్స్ 145 పాయింట్లు కోల్పోయి 25,590కి పడిపోయింది. నిఫ్టీ 48 పాయింట్లు నష్టపోయి 7,786కి పతనమైంది. బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్... బెర్జర్ పెయింట్స్ (6.11%), గుజరాత్ స్టేట్ పెట్రోనెట్ (5.30%), కైలాష్ ఆటో ఫైనాన్స్ (4.52%), కార్పొరేషన్ బ్యాంక్ (4.35%), ఎస్ఆర్ఈఐ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ (4.22%). టాప్ లూజర్స్... నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (-6.57%), మారీకో లిమిటెడ్ (-4.20%), గ్రేట్ ఈస్టర్న్ షిప్పింగ్ కంపెనీ లిమిటెడ్ (-3.29%), ఇండియా సిమెంట్స్ (-3.13%), ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-3.06%).