: తరుణ్ గొగోయ్ పై 100 కోట్ల పరువు నష్టం దావా
అసోం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ పై ఆయన మాజీ మంత్రి వర్గ సహచరుడు, ప్రస్తుత బీజేపీ నేత హిమంత విశ్వకర్మ 100 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేశారు. గౌహతీలో ఆయన మాట్లాడుతూ, ఓ చిట్ ఫండ్, లూయీ బెర్జర్ కుంభకోణాల్లో ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ తనపై నిరాధార ఆరోపణలు చేస్తూ, తన ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నారని అన్నారు. గొగోయ్ తో పాటు ఓ ఆంగ్ల దినపత్రికపై కూడా కేసు వేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. కాగా, హేమంత విశ్వకర్మ గతంలో తరుణ్ గొగోయ్ కి కుడి భుజంలా వ్యవహరించారు. విభేదాలు తలెత్తడంతో బీజేపీ తీర్థం పుచ్చుకుని, తన వర్గాన్ని బీజేపీలోకి తీసుకెళ్లారు. దీంతో వీరి మధ్య వివాదం నడుస్తోంది.