: బ్రూనైలో క్రిస్మస్ నిషేధం...అతిక్రమిస్తే ఐదేళ్ల జైలు శిక్ష


క్రీస్తు జననానికి ప్రతీకగా డిసెంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం సర్వసాధారణం. అయితే, బ్రూనై దేశంలో క్రిస్మస్ వేడుకలను నిషేధిస్తున్నట్టు ప్రకటించారు. బోర్నియా ఐలాండ్ లోని అతిచిన్న దేశమైన బ్రూనేలో 65 శాతం ముస్లిం మతస్థులే కావడం విశేషం. తమ దేశంలో క్రిస్మస్ ను నిషేధిస్తున్నట్టు, నిషేధాన్ని ధిక్కరిస్తే ఐదేళ్ల జైలు శిక్షను విధిస్తామని బ్రూనే సుల్తాన్ హసన్ అల్ బొల్కాయ్ ప్రకటించారు. అయితే, తమ దేశంలో ముస్లిమేతరులు క్రిస్మస్ నిర్వహించుకోవచ్చు కానీ, దానిలో తమ వర్గాన్ని మాత్రమే కలుపుకోవాలని సూచించారు. ఈ వేడుకలకు ముందుగా అధికారుల నుంచి అనుమతులు పొందాలని స్పష్టం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో వేడుకలు నిర్వహిస్తే...అది ఇతర మతాలను అవమానించడమేనని నిషేధాజ్ఞల్లో పేర్కొన్నారు. ఆ వేడుకల్లో ముస్లింలు పాల్గొనకూడదని స్పష్టం చేశారు. వేడుకల్లో సరదాగా శాంటా తెల్ల టోపీలు ధరించడం, స్వీట్లు తినడం, శుభాకాంక్షలు తెలపడం నిషిద్ధమని పేర్కొన్నారు. వీటిని ధిక్కరిస్తే ఐదేళ్ల కఠిన కారాగారశిక్ష అనుభవించాల్సి ఉంటుందని బ్రూనై సుల్తాన్ స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News