: వైకాపా ఎమ్మెల్యేలను కుక్కలతో పోల్చారు: కల్పన


వైకాపా ఎమ్మెల్యే రోజా వ్యవహారంపై ఈ రోజు శాసనసభలో పెద్ద చర్చే జరిగింది. దీనిపై వైకాపా ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన మండిపడ్డారు. రోజా ఏదో అన్నారంటూ మూడు రోజుల తర్వాత ఒక మహిళా ఎమ్మెల్యేతో మాట్లాడించారని విమర్శించారు. రోజాను ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపా ఎమ్మెల్యేలను కుక్కలతో పోలుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత మహిళలను, అంబేద్కర్ ను అడ్డం పెట్టుకుని కాల్ మనీ వ్యవహారాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలను చర్చించడం మానేసి, వైకాపాను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News