: ఆస్కార్ రేసులో సాయికుమార్ సినిమా
ప్రముఖ నటుడు, గాత్రదాత సాయికుమార్ నటించిన సినిమా ఆస్కార్ రేసులో నిలిచింది. తెలుగు వాడైన సాయికుమార్ కు కన్నడ చిత్ర రంగంలో స్టార్ హీరో ఇమేజ్ ఉంది. తెలుగుతో పోలిస్తే కన్నడ నాట ఆయన సినిమాలకు మంచి ఆదరణ కూడా లభిస్తుంది. ఈ మధ్య ఆయన నటించిన 'రంగితరంగ' సినిమా మంచి విజయం సాధించడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో ఈ సినిమా ఆస్కార్ బరిలో నిలిచింది. దీంతో వచ్చే నెలలో జరగనున్న అకాడమీ అవార్డ్స్ పోటీలో దీనిని ప్రదర్శించనున్నారు. ఈ సినిమాకు అవార్డు ఖాయమనే ధీమాలో యూనిట్ ఉంది. కాగా, ఈ సినిమాను అనూప్ భండారీ అనే నూతన దర్శకుడు రూపొందించడం విశేషం.