: దివాకర్ రెడ్డికి అసెంబ్లీలో ఏం పని?: సీపీఐ రామకృష్ణ
కాల్ మనీ వ్యవహారంలో ప్రమేయమున్న నేతలందరినీ విచారించాలని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. శాసనసభలో ప్రతిపక్షం లేకుండానే బిల్లులను పాస్ చేయడం మంచిది కాదని అన్నారు. ఏపీలో 600 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టించుకోలేదని విమర్శించారు. అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ రామకృష్ణ ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై మండిపడ్డారు. ఓ వైపు పార్లమెంటు సమావేశాలు జరుగుతుంటే, అక్కడకు వెళ్లకుండా ఈయన అసెంబ్లీకి వెళ్లడమేమిటని ప్రశ్నించారు. నిన్న అసెంబ్లీ మీడియా పాయింట్ లో దివాకర్ రెడ్డి మాట్లాడుతూ, జగన్, రోజాలపై విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.